ప్రపంచవ్యాప్త ప్రతిభ, అత్యుత్తమ నైపుణ్యం, మేధో సంపత్తి అన్ని కలసి రావడం వలనే దిగ్గజ సంస్థలైన యాపిల్, ఐబియమ్, సిస్కో ప్రపంచస్థాయి సంస్థలుగా పేరొందటం జరిగింది. స్వేచ్ఛాయిత వాణిజ్య వ్యవస్థ నుంచే, ప్రపంచం ప్రయోజనం పొందుతుంది తప్ప, కట్టుబాట్లు విధించటం వల్ల, నిపుణులు అందుబాటలో లేని ప్రమాదం ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తుల నాణ్యత తీవ్రంగా తగ్గే అవకాశం ఉంటుందన్నారు ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్. పరోక్షంగా అమెరికా విధిస్తున్న H1-B విసాదారుల ఆంక్షలను ప్రస్తావిస్తూ, అమెరికా సంస్థలు సహా ప్రపంచంలోని పలు అత్యుత్తమ కంపెనీలు, విలువలు, గ్లోబల్ సప్లై చైన్ వలనే పెరిగాయని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు.