//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అపోలో టైర్స్‌ ఆదాయం రూ.3639 కోట్లు

Category : business

జనవరి-మార్చి త్రైమాసికంలో అపోలో టైర్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.228.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2015-16 ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.272.05 కోట్లతో పోలిస్తే ఇది 16.10 శాతం తక్కువ. సమీక్షా త్రైమాసికంలో సంస్థకు రూ.3,639.39 కోట్ల ఆదాయం సమకూరింది. 2015-16లో వచ్చిన ఆదాయం రూ.3,268.84 కోట్లతో పోలిస్తే ఇది 11.33 శాతం ఎక్కువ. ముడిసరకు ధరలు పెరగడం లాభదాయకతపై ప్రభావం చూపినట్లు సంస్థ వెల్లడించింది. 2015-16 నాలుగో త్రైమాసికంలో ముడిసరకుపై రూ.1,347.23 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.1,739.22 కోట్లను వ్యయం చేసినట్లు తెలిపింది.