భారత పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18) సీఐఐ ప్రెసిడెంట్‌గా ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సీఐఐకి తొలి మహిళా ప్రెసిడెంట్ శోభనా కామినేని కావడం గమనార్హం. ఇప్పటివరకు ఫోర్బ్స్ మార్షల్ లిమిటెడ్ సహ చైర్మన్ నౌషధ్ ఫోర్బ్స్ సీఐఐకి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి కూతురైన శోభనా కామినేని.. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ పట్టా పొందారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం ఈమె అపోలో హాస్పిటల్‌తోపాటు కేఈఐ గ్రూపునకు కూడా వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూపు లాజిస్టిక్స్, మౌలిక వసతుల రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నది. సీఐఐ కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా కొటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కొటక్ ఎన్నికయ్యారు.