//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Raghu Veera Reddy | ఢిల్లీ లోధీక్ష ..అందరూ కలిసి రావాలి తాడోపేడో తేల్చాలి..!

Category : politics

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం,మన హక్కులను సంపాదించుకుందాం అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు.విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేంద్రబడ్జెట్ లో ఏపీకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన,నిరసనకు దిగుతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోనే ఉండి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.పార్టీలకు అతీతంగా అందరూ కలసి వెళదామని,అందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అన్ని రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని,ఢిల్లీ వెళ్లి దీక్ష చేద్దామని అన్నారు.

మార్చి 6, 7 తేదీల్లో ఢిల్లీలో దీక్ష చేద్దామని,8వ తేదీన పార్లమెంట్ ను ముట్టడిస్తామని పేర్కొన్నారు.మార్చి 2వ తేదీన ‘మనందరం ఒక్కటవుదాం’ అంటూ రాజకీయపార్టీలకు,ప్రజా సంఘాల నేతలను కోరారు.కాగా ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ముందు ఒకరోజు ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’ చేపడుతున్నట్టు చెప్పారు.

Related News