//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలో మనమే నెం.1 !

Category : world

ఎపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టేనాటికి ఏపీ పరిస్థితి మునిగేనావ లాంటిది. రాజధాని లేదు..ఆదాయం లేదు..పాతాళంలా కనిపించే రెవెన్యూలోటు..చేతిలో చిల్లిగవ్వ లేదు. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలన్న ఆలోచనతో తలచుకుంటేనే సగటు ఆంధ్రుడి గుండె చెరువైపోతోంది.

అన్యాయం జరిగిందని ఆగిపోకుండా.. ఒక సవాల్‌గా స్వీకరించారు. పరిపాలనలో ఎదురయ్యే చిక్కుముళ్లను అధిగమిస్తూనే..సుధీర్ఘమైన ప్రణాళికతో రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. ఇలా ఆయన రాష్ట్రము కోసం శ్రమిస్తుంటే మరో పక్క మన రాష్ట్రము ఇంకో విషయంలో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తోంది.

అక్రమంగా అమ్మాయిల తరలింపు, వ్యభిచార గృహాల నిర్వహణపై దేశంలో చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకునే వారు అంతంతమాత్రమే. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందుందని, ఏపీ నుంచి అమ్మాయిల రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణ అత్యధికమని, దేశంలోనే ఎక్కువగా జరుగుతోందని తాజా నివేదికలో అధికారులు వెల్లడించారు.

ఇక ఈ తరహా ఘటనలపై ఉక్కు పాదం మోపేందుకు ఏపీ సర్కారు కఠిన చర్యలు ప్రారంభించినప్పటికీ, పట్టుబడిన వారు చిన్న చిన్న శిక్షలు, బెయిల్ తీసుకుని బయటకు వస్తూ తిరిగి అదే పనిలో నిమగ్నమవుతున్నారు. దీంతో వేశ్యావాటికలకు బాలికలను విక్రయించే మహిళలు, ముఠాలపై తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అవుతున్నాయి.

యాంటీ ట్రాఫికింగ్ చట్టాలపై అధ్యయనం కోసం న్యాయ నిపుణులతో ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ రెండు నెలల్లో రిపోర్టును ఇవ్వాల్సివుంది. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్‌ గురించి మాట్లాడిన కమిటీ సభ్యురాలు సునీతా కృష్ణన్, వ్యభిచారం నిర్వహించేవారు, వ్యభిచార గృహాలు నిర్వహించే వ్యక్తులకు ఈ చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని అన్నారు.

బాలికలను కొనేవారు ఉన్నంతకాలం అమ్మేవారు పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు. అయితే, హ్యూమన్ ట్రాఫికింగ్‌ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. ఇండియాలో 2 కోట్లమంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా వేసిన ఆమె, వీరిలో కేవలం 40 లక్షల మందే స్వచ్ఛందంగా వృత్తిలోకి వచ్చారని, మిగతా 1.6 కోట్ల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగమైన మహిళలు, బాలికలేనని ఆన్నారు.