Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక ఏపి లో టీడీపి చాప్టర్ క్లోజ్.... తెర వెనుక వ్యూహాలతో పట్టు సాధిస్తున్న బీజేపీ.

Category : politics

అందరూ ఊహించినట్టుగానే భారత దేశ రాజకీయాల్లో మరో మారు అధికారం లోకి వచ్చి. తమ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని బహిర్గతం చేసిన కమలం పార్టీ. మొన్న వెలువడిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 4 చోట్ల స్పష్టమైన మెజారిటీ తో గెలిచి...పలు చోట్ల టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీ లకు చుక్కలు చూపించింది.ఈ దెబ్బతో ఆ పార్టీ కి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ముందు నుంచి కూడా దక్షిణాదిలో అంతగా బలం లేని ఆ పార్టీ. ఈ మధ్య కాలంలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అందులో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇకనైనా పాగా వెయ్యొచ్చని బీజేపీ ఫిక్సైంది.ఇక తెలంగాణలో 2023 ఎన్నికలే టార్గెట్ గా తమ పార్టీ తడాఖా చూపించాలనుకుంటున్నది... అందులో భాగంగానే ఏపీలో కూడా పాగా వేసేందుకు ప్లాన్స్ అమలు చేస్తుంది.

ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో పట్టు సాధించాలని చూస్తుంది.మొన్నటి ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అక్కడ ఘోర పరాజయం మూట కట్టుకున్న నేపద్యంలో ఎలాగైనా ఆ స్థానంలో తాను ఎదగాలని భావిస్తోంది . ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా ఏపీ లో ఆ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... ఢిల్లీలోనీ కీలక నేతలతో భేటీలు నిర్వహిస్తు వన్నారు. ఈ లెక్కన 2024 నాటికి ఏపీలో బీజేపీ డబుల్ డిజిట్ ఫలితాలు సాధించాలన్నదే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కుల,మత సామాజిక వర్గాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందులో భాగంగానే ఆయా సామాజిక వర్గాల కీలక నేతల్ని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తు పట్టు కొనసాగించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఎలాగూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమదే కాబట్టి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామనే భరోసా కల్పిస్తుంది.

ఇక ఇప్పట్లో టీడీపీ పార్టీ ఏపి లో కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు కూడా... తమ భవిష్యత్‌పై లెక్కలేసుకొని బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి... ఆ పార్టీతో కలిసి సాగితే, తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఆలోచనలోనే కేంద్రం ప్రభుత్వం ద్వారా అన్ని ప్లాన్స్ అప్లై చేయాలి చూస్తున్నారు. ఇక దీనిపై రెండు నెలల తర్వాతి నుంచే ఆపరేషన్ ఏపీ బీజేపీ బయటికి వస్తుందని, అప్పటివరకూ తెరవెనక సంప్రదింపులూ, సన్నాహాలూ,బుజ్జగింపులు, పార్టీ పురమాయింపులు జరుగుతాయని తెలుస్తోంది. ఏపీలో జగన్‌కి తమతో అవసరాలు ఉన్నాయే తప్ప... తమకు జగన్‌తో అవసరాలు లేవనుకుంటున్న బీజేపీ శ్రేణులు ... పైకి వైసీపీతో సఖ్యతగా ఉంటూనే, తెరవెనక తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు కదుపుతున్నారు.