//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ హోదా రగడ ... తెలంగాణా సీఎం కేసీఆర్ మౌనంపై రాములమ్మ సెటైర్లు ..

Category : politics state

తెలంగాణ సీఎం కేసీఆర్ మీద విజయశాంతి ఈ మధ్య తెగ సెటైర్లు వేస్తున్నారు. మొన్నటివరకు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కెసిఆర్ మీద విరుచుకుపడితే ఇప్పుడు తాజాగా విజయశాంతి దూకుడు చూపిస్తున్నారు.ట్వీట్లతో పంచ్ ల మీద పంచ్ లు ఇస్తున్నారు రాములమ్మ అలియాస్ విజయశాంతి.ఇటీవల కాలంలో ఏపీకి సంబంధించిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాల మీద ఆమె కేసీఆర్ తీరును తప్పు పడుతున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చంద్రబాబు చేసిన దీక్ష నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును ఆమె తప్పు పట్టారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ను కాంగ్రెస్ తో సహా దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థించాయని.. దానిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. కేసీఆర్ కామ్ గా ఉన్నారంటూ తప్పు పట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే దీక్షకు మద్దతు తెలపని టీఆర్ఎస్ అధినేత.. విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొనాలని అనుకోవటం ఏమిటంటూ క్వశ్చన్ వేశారు.కేసీఆర్ కు పంచ్ వేస్తూ రాములమ్మ పెట్టిన పోస్ట్ ను యథాతధంగా చూస్తే..

‘‘ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్ష ద్వారా కాంగ్రెస్ చీఫ్ రాహూల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడితే తప్ప తెలుగు ప్రజలకు న్యాయం జరగదన్న విషయంపై స్పష్టత వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ముక్త కంఠంతో నినదించారు. కానీ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని ప్రకటించిన కేసీఆర్ గారి నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీ నామమాత్రంగానైనా ఈ విషయంపై ప్రకటన చేయలేదు.

కేసీఆర్ గారికి తెలుగు ప్రజల ఆకాంక్షల కంటే - మోదీ ప్రాపకం మాత్రమే ముఖ్యమన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశాన్ని కదిలించే రీతిలో జరిగిన దీక్షకు మద్దతు తెలపలేని టీఆర్ ఎస్ అధినేత - విజయవాడకు వెళ్లి అక్కడి ప్రజల అభిమానం చూరగొందామని కలలు కంటున్నారు. ఇలాంటి అవకాశవాద రాజకీయం చేసే నేతలనే కాదు వారిని చేరదీసే వారినీ ఎక్కడ ఉంచాలో ఏపీ ప్రజలకు బాగా తెలుసు’’ అని రాములమ్మ సంధించిన బాణం చాలా పవర్ ఫుల్ బాణమే.

Related News