//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీకి ప్రత్యేక హోదా లేదు, రాయితీలు లేవు : తేల్చి చెప్పిన కేంద్రం

Category : politics

ఢిల్లీ లోతెలుగు రాష్ట్రాల నేతలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో తీవ్రమైన ఆందోళనలు చేస్తున్నారు.ఉభయ సభలను స్తంభింప చేస్తున్నారు.ఢిల్లీ లో వైసీపీ నేతలు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిన్న ధర్నాకు దిగారు.ఈ రోజు కాంగ్రెస్ నాయకులూ కూడా ప్రత్యేక హోదా కు సపోర్ట్ గా ఆందోళనలు చేసారు.ఈ ఆందోళనలల్లో జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.

కేంద్రం లో వున్నా బీజేపీ నేతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు . ప్రత్యేక హోదా కన్నా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం .

ప్యాకేజీని మాత్రమే అమలుచేసి మిగిలిన హామీలు సాధ్యం కాదని ప్రకటించాలని కేంద్రం అంచనాకు వచ్చినట్లు సమాచారం. నిన్నకేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి తో జరిగిన కీలక భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని తెదేపా నేతలు చెప్పారు. హోదాకు బదులు ప్యాకేజీపైనే మొగ్గుచూపుతున్న కేంద్రం పన్ను రాయితీలు కల్పించడం సాధ్యం కాదని ఆర్థికశాఖ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇస్తే వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు కూడా డిమాండ్‌ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. నిన్న జరిగిన చర్చలో ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చించాకే పన్ను రాయితీలు కల్పించే అంశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నాలుగేళ్లలో పోలవరం, రెవెన్యూలోటు సహా పలు పద్దుల కింద రూ.12500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినా రాష్ట్రం నుంచి ఒక్క రూపాయికి కూడా లెక్కలు చూపలేదని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడేమీ యుద్ధాలు జరగడంలేదు కదా, రక్షణ శాఖకు అన్ని నిధులు ఎందుకని అడిగినా అడుగుతారని ఆర్థికశాఖ ఘాటుగా వ్యాఖ్యానించింది.

సైన్యానికి కేటాయించిన నిధులు కూడా ఏపీకి కేటాయించాలని డిమాండ్‌ చేసినా చేస్తారని ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఏపీ కొత్తగా అడుగుతున్న రాయితీలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని స్పష్టమౌతుంది.

Related News