//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది...!

Category : politics

నిన్న ఏపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులతో జరిపిన చర్చల తరువాత కూడా, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడం పట్ల టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

దీనిపై నిరసన గా ఈ రోజు ఉభయ సభలను స్థంబింప చేస్తున్నారు.నిరసన ల మధ్య ఉభయసభలను వాయిదా వేశారు. ఏపీకి ఎంతో ఇచ్చామంటూ దొంగలెక్కలు చెబుతున్నారని ఎంపీలు తీవ్రంగా ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ లో వున్న హామీలను కూడా ఇచ్చేది లేదని బీజేపీ స్పష్టం చేసిందన్నారు. కేంద్రంలో జరుగుతున్నఈ విషయాలపై ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారని ఎంపీ మురళీమోహన్ గారు చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోబోతున్నామని ఎంపీ స్పష్టం చేశారు.

Related News