//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ సత్తా చాటిన బాబు ..నాలుగున్నరేళ్ళలో 635 జాతీయ అవార్డులు

Category : politics state

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ... తెలంగాణా సీఎం కేసీఆర్ చెప్పినట్టు తక్కువ వాడు కాదు . రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న నాయకుడు. అంతే కాదు మంచి విజన్ వున్న పరిపాలనా దక్షుడు . ఇక ఆయన మార్గ‌ నిర్దేశంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి చెందుతోంది . ఏపీ లోటు బడ్జెట్ రాష్ట్రం గా పాలన ప్రారంభించిన ఆయన విజ‌న్ , ప్లానింగ్ తో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే ప్రగతిలో పరుగు తీయించారు. రాష్ట్రాన్ని ప‌లు రంగాల్లో దేశంలోనే నెంబ‌ర్ 1గా నిల‌బెట్టారు చంద్రబాబు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన ఏపీ ని నవ్యాంధ్ర గా తీర్చిదిద్దే పని లో పడ్డారు చంద్రబాబు.

ఇక చంద్రబాబు పాలనకు , సాధించిన ప్రగతికి, చేసిన అభివృద్ధికి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వ‌చ్చిన అవార్డులే నిదర్శనం. గ‌త నాలుగున్న‌రేళ్లలో ఏపీకి వివిధ రంగాల్లో 635 అవార్డులు వ‌చ్చాయి అంటే అది చంద్రబాబు సత్తా . వాటిలో ఒక్క విద్యుత్తు శాఖే ఏకంగా 107 అవార్డుల‌ను సొంతం చేసుకుంది అంటే చంద్రబాబు పాలనా నైపుణ్యం అర్ధం చేసుకోవచ్చు . మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ 91 పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్నాయి. పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌లను 82 అవార్డులు వ‌రించాయి.

విభాజిత ఏపీ లో నూత‌న రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక చంద్రబాబు విద్యుత్తు రంగంలో చంద్ర‌బాబు ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. సోలార్ ప్రాజెక్టులు ఎన్నో చెప్పాట్టారు. దీంతో మిగులు విద్యుత్ గ‌ల రాష్ట్రంగా ఏపీ అవ‌త‌రించింది. రాష్ట్ర విద్యుత్తు రంగం దేశానికే ఆద‌ర్శ‌ప్రాయంగా నిలిచింది. విద్యుదుత్ప‌త్తిలో అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటించినందుకుగాను ఏపీ ట్రాన్స్ కో సీఎండీ విజ‌యానంద్ ను 9వ ఎన్ ఎర్షియా అవార్డు వ‌రించింది. ఇక బ్యూరో ఆఫ్ ఎన‌ర్జీ ఎఫీషియెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ప‌వ‌ర్‌, నేష‌న‌ల్ ఎన‌ర్జీ క‌న్స‌ర్వేష‌న్ అవార్డ్-2015ల‌ను సీఈవో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స్వీక‌రించారు. గ్రామీణ విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో అత్యుత్త‌మ ప‌నితీరుకుగాను అత్యున్న‌త ఇప్పై-2016 అవార్డు ఏపీకి ల‌భించింది. వ్య‌వ‌సాయ రంగంలో రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా సోలార్ పంప్ సెట్లు ఏర్పాటుచేసినందుకుగాను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయ‌క్ కు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూయెబుల్ ఎన‌ర్జీ శాఖ అవార్డు ఇచ్చింది. సౌర విద్యుత్తు రంగంలో అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటిస్తున్నందుకుగాను పీఎస్ ఈఎస్ ఇన్వెస్ట్‌మెంట్ అవార్డు కూడా ఏపీ మణిహారంగా చేరాయి.

ఇక పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు మొత్తంగా 82 అవార్డులు ద‌క్కాయి. అందులో 66 అవార్డుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం, ఎనిమిదింటిని స్కోచ్ గ్రూప్‌, రెండింటిని స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్, ఓ అవార్డును బిజినెస్‌ వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ఇండియా అందించాయి. ఇక 2017లో గ్రామీణ ఉపాధి హామీ ప‌నుల అమ‌లులో విజ‌య‌న‌గ‌రం దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల కిలోమీట‌ర్ల‌కుపైగా సిమెంటు రోడ్లు వేయ‌డం ద్వారా ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ రికార్డు సృష్టించింది. ఇంత కృషి జరిగేలా ఎప్పటికప్పుడు మానిటర్ చేసింది మాత్రం సీఎం చంద్రబాబు .

ఇక మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ , అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ‌ల‌ను జాతీయ స్థాయిలో 2015లో 6, 2016లో 12, 2017లో 31, 2018లో 43 అవార్డులు లభించాయి. కేంద్ర హౌసింగ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ 20 అవార్డుల‌ను బ‌హూక‌రించింది. క‌ర్నూల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ 5, విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ 9, విశాఖ‌ప‌ట్నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ 6, కాకినాడ , తెనాలి ,ఒంగోలు రెండు చొప్పున‌, బొబ్బిలి , గుడివాడ ,ఉయ్యూరు,సామ‌ర్ల‌కోట ఒక్కొక్క‌టి చొప్పున అవార్డుల‌ను తమ ఖాతాలో వేసుకున్నాయి.

ఏపీ మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ 55 అవార్డుల‌ను గెల్చుకుంది. ఆరోగ్య రంగంలో అత్యున్న‌త ప్ర‌మాణాల‌కుగాను 2017లో స్కోచ్ గ్రూప్ ప్రీమియం అవార్డు ల‌భించింది. గ‌తేడాది మార్చిలో స్కోచ్ గోల్డెన్ అవార్డు వ‌రించింది. ఆ త‌ర్వాత జూన్ లో మ‌రో అవార్డు ద‌క్కింది. గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో ఐటీ శాఖ‌కు 38, పాఠ‌శాల విద్య‌కు 33, జ‌ల వ‌న‌రుల శాఖ‌కు 30 అవార్డులు ద‌క్కాయి. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేష‌న్ అండ్ ప‌వ‌ర్(సీబీఐపీ) అవార్డు ద‌క్కింది. ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి ఈ అవార్డు నిద‌ర్శ‌నం. ఏపీ యూత్ వెల్ఫేర్ శాఖ‌కు 20, మ‌హిళాశిశు సంక్షేమ‌శాఖ , హౌసింగ్ –,సాంఘిక సంక్షేమ‌శాఖ‌ల‌కు 15 చొప్పున అవార్డులు వ‌చ్చాయి.

ఏపీ ఖాతాలో చేరిన మరిన్ని అవార్డుల విషయానికి వస్తే గ్రామీణాభివృద్ధి శాఖకు 12 ,పౌర స‌ర‌ఫ‌రాల శాఖకు 10 ,టూరిజం కు 10,

మైన్స్ అండ్ జియాల‌జీ కి 10,రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు 8,రెవెన్యూ కి 8,ప‌రిశ్ర‌మ‌ల శాఖకు 7 ,హార్టీక‌ల్చ‌ర్ శాఖకు 6,రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కు 5, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ కి 5 ,ఫైనాన్స్ కు 5, వ‌యోజ‌న విద్య కు 4 ,గిరిజ‌న సంక్షేమ శాఖకు 4,ప‌ర్యావ‌ర‌ణం కు 2,

ప్లానింగ్ కి 2 ,పోలీస్ శాఖకు 2 ,గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా కు 2,వ్య‌వ‌సాయం కు 1,హోం శాఖకు 1,స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ కు 1,

నైపుణ్యాభివృద్ధి కి 1, ఇక ఇత‌ర రంగాలకు 28 అవార్డులు వరించాయి. మొత్తంగా చూస్తే నాలుగున్నరేళ్ళ లో 635 అవార్డులు వరించాయంటే ఆ అవార్డుల వెనుక ఎంత కృషి వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీ ఘనత .