//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ రాజకీయం......యాక్షన్ ప్రారంభించిన చంద్రబాబు..!

Category : politics

ఏపీ లో రాజకీయం రోజు రోజుకి ఉగ్ర రూపం దాల్చుకుంటూ ముందుకుపోతుంది. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి అప్పుడే ఎన్నికలకి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాడని తెలుస్తుంది.

ఏపీ సీఎం గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కష్ట పడుతున్నాడు. ఆరు పదుల వయస్సు లో కూడా రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు. కేంద్రం నుండి తమ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుండి బీజేపీ సీఎం చంద్రబాబు పై ప్రతిపక్ష నేత జగన్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత తీవ్రమైన విమర్శలు చేయిస్తుంది.

దీనితో తన యాక్షన్ ప్రారంభించారని అందరూ అనుకుంటున్నారు. నిన్న కడప లో సీఎం రమేష్ ఉక్కు దీక్ష విరమింప చేస్తూ అయన చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనం, మరో రెండు నెలలో కడప లో ఉక్కు పరిశ్రమ పెట్టక పొతే, రాష్ట్రప్రభుత్వం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుందని అయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. అలాగే విశాఖ రైల్వే జోన్ కోసం కూడా తొందర్లో మంత్రులందరూ కలిసి దీక్ష కి దిగనున్నారు.

Related News