//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకియంలో రాజనీతి ఉందా... ఎవరి మాటలు నమ్మాలి..

Category : politics

రాజకీయం ...........రాజకీయం అంటే అధికారం కాదు. ప్రజలు నమ్మి ఇచ్చే పెద్ద భాద్యత. ఒకప్పుడు రాజకీయం అంటే చెప్పిన మాట మీద నిలబడడం లేకపోతె ప్రాణాలైనా అర్పించటం ఇదే. కానీ ప్రస్తుత రాజకీయంలో రాజనీతి ఉందా.....ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు కరగనున్నాయి. దీని కోసం ఇప్పటి నుండే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకుపోతున్నారు.

ముఖ్యం గా రాజకీయాలలో ఎక్కువ కాలం ప్రజల మన్నలని పొందాలంటే రాజనీతి ఎంతో అవసరం. ఇప్పటి తరం నాయకులకి రాజనీతి అనే పదానికి అర్థం కూడా తెలియదు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికలల్లో నన్ను గెలిపించండి మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు తప్ప , ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ఏంచేసాడో తనపైన తెలుసులో లేదో . ఇంకో పార్టీ గుర్తు తో గెలిచిన ఎమ్మెల్యే లని భారీ మొత్తం చెల్లించి తమ పార్టీలోకి కొనుక్కున్నారు , పైగా వారికీ మంత్రి పదవులు ఇచ్చి మాది నిజాయితీకి మారుపేరుగల పార్టీ అని చెప్పుకుంటుంటారు. రాజకీయాలలో ఒక పార్టీ గుర్తుతో గెలిచాక ఇంకో పార్టీలో జాయిన్ కావాలంటే ఆ పార్టీకి రాజీనామా చేయాలనీ కూడా తెలియని రాజకీయ అపరచాణిక్యుడు మన సీఎం చంద్రబాబు. మాటకొస్తే నాకు 40 ఏళ్ల అనుభవం వుంది అని చెప్పుకుంటూ కాలక్షేపాపం చేస్తున్నాడు.

ఇక పొతే ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ .....వైసీపీ అధినేత , రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ మాట చెప్పే ప్రతిసారి మా పార్టీ రాజనీతితో నడుపుతున్నాం అంటాడు, మరో పక్క ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. రాజనీతితో పార్టీని ముందుకు తీసుకుపోతున్నామని జగనో , వైసీపీ నేతలతో అనుకుంటే సరిపోదు ప్రజలు అనుకునేలా చేయాలి అప్పుడు ఆ పార్టీకి రాజనీతి ఉంది అనుకుంటారు. రాజనీతి ఉన్న పార్టీ అయితే వ్యక్తిగత విమర్శలు రాజకీయంలో అస్సలు ఉండకూడదు , కానీ జగన్ ప్రతిసారి ఎవరోఒకరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూనే ఉంటాడు. మళ్ళీ రాజనీతి ఫాలో అయ్యే ఏకైక పార్టీ వైసీపీనే అని చెప్తాడు.

ఇక పొతే పవన్...నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి ... మీ తలరాతలే మారుస్తానంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభలలో తెగ చెప్తున్నాడు. ఆయనకి తెలియని విషయం ఏమిటంటే రాజకీయాలలో కొనసాగాలంటే చూపిన మాటకి , చేసే పనులకి సంబంధం ఉండాలి ...పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏంచెప్తాడో ఆయనకే తెలియదు ఇక ఆయనని నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోతాడో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి....ప్రశ్నించడానికే వచ్చా అన్న పవన్ ఇప్పుడు ఏవిధంగా ప్రశ్నిస్తున్నాడో అందరికి తెలిసిందే......

మన భవిష్యత్ మారాలి అంటే మొదటగా మన రాజకీయాల్లో మార్పు రావాలి....ప్రజలు ఆలోచించేది మాత్రం అధికారం ఉన్న లేకపోయినా తమ భాగోగులని చూసే నాయకుడి కోసం ఇప్పటికి ఇంకా ఎదురుచూస్తేనే ఉన్నారు. ఇంకా మీకు ఒక్క ముక్కలో అర్థం కావాలంటే భరత్ అనే నేను సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు " ఎట్టకేలకు ఒకడొచ్చాడు రాజకీయనాయకుడనుకున్న కానీ నాయకుడువచ్చాడు " అనే మాట మనం అనుకునే రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం...

Related News