//single page style gallary page

AP PAC Chairman Payyavula Keshav ...

Category : politics state

Click here to read this article in Telugu

ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌...

ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెదేపా అధికారంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.