//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి నేత సావాసంలో ఏపి మంత్రులు

Category : politics

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తుంటే ఎందుకు గుంటూరు జిల్లా నేతలు స్పందించడం లేదు..? ఇప్పుడు ఈ ప్రశ్న పార్టీని వేధిస్తుంది.

జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ళ నరేంద్ర, పెదకూరపాడు ఎమ్మెల్యే, గుంటూరు అర్బన్‌ అధ్యక్షుడు చందూ సాంబశివరావు, ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి, మంత్రి ఆనంద్‌బాబు, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు చంద్రబాబుపై విమర్శలను తిప్పికొట్టడం లేదు.

మాట్లాడితే ఎమ్మెల్సీలు అన్నం సతీష్ ప్రభాకర్ లేదా బుద్హా వెంకన్న మినహా ఏ ఒక్కరు స్పందించడం లేదు. అలాగే మరి కొందరు కీలక నేతలు కూడా ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. అయితే దీనికి కారణం ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వీళ్ళకు వ్యాపార భాగస్వామి అని అందుకే విమర్శించడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామం ఇప్పుడు పార్టీలో తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. అలాంటి నేతలను చంద్రబాబు ఎందుకు భరిస్తున్నారు అంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహ౦ వ్యక్తం చేస్తున్నారు.