//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గజల్‌‌ను ఉరితీసినా పాపంలేదు: ఏపీ మంత్రి!

Category : national

రేడియో జాకీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

దీనిపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బుధవారం స్పందిస్తూ.. గజల్ శ్రీనివాస్‌ను వెనుకేసుకొచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని, అతడు అమ్మాయిలను లైంగికంగా వేధించాడంటే నమ్మనన్న ఆయన ఆయన ఇంతలోనే మాటమార్చారు. గజల్‌పై కావాలనే కుట్ర చేశారని బుధవారం మీడియా ముందు వ్యాఖ్యానించిన ఆయన, గురువారం మాత్రం తాను అలా మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు.

గజల్ శ్రీనివాస్‌ను సమర్థిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ రాసలీల వీడియోలను రాత్రే చూశానని, ఆపై ఎంతో సిగ్గు పడ్డానని, షాక్ తిన్నానని అన్నారు. అతడిని ఉరి తీసినా తప్పు లేదన్న మంత్రి, శ్రీనివాస్‌ను నాణేనికి ఒకవైపు మాత్రమే చూశానని, రెండోవైపు అతడి ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉందని, ఇలా చేస్తాడని ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు. గజల్ శ్రీనివాస్ వంటి వ్యక్తులకు సమాజంలో ఉండే అర్హత లేదని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.