Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ నేత‌లు ఢిల్లీ వైపు ....? మ‌రి ప‌వ‌న్ మౌనం ఎటు వైపు .....?

Category : state politics

ఏపీ ఎన్నిక‌ల‌లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ సీఎం చంద్ర బాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అక్క‌డి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కు నోటీసులు ఇచ్చారు.దానితో స‌రిపెట్ల‌కోకుండా ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్ లు ముద్దు అంటూ జాతీయ నేత‌ల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డంతో ,ఇక నుండైనా పేప‌ర్ బ్యాలేట్ వాడాల‌ని దీనిపై విజ‌యం సాధించే వ‌ర‌కు పోరాడ‌తామని చేప్పారు.చంద్ర బాబు వెళ్లారు మ‌రీ నేను వెళ్లోద్ధా అనుకున్నారో ..? ఏమో...? తెలియ‌దు కానీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కూడా ఢిల్లీ బాట ప‌ట్టారు .

అయితే ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎన్నిక‌ల తీరును ఎండ‌గ‌ట్ట‌కుండా , త‌మ కార్య‌కర్త‌ల‌పై దాడులు చేశార‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీకి ఫిర్యాదు చేశారు.ఇక చివ‌రికి ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ కూడా ఎన్నిక‌ల తీరు త‌ప్పు బ‌డుతూ ఢిల్లీ వెళ్లిన కానీ...ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎన్నిక‌ల తీరు పై ఎక్క‌డికి వెళ్ల‌క పోవ‌డం పై ప్ర‌ధానంగా కొంత చ‌ర్చ న‌డుస్తుంది .గ‌తంలో ప‌వ‌న్ బీజేపీ కి స‌పోర్టుగా నిలిచారు.కానీ ...ప్ర‌త్యేక హోదా విషయంలో కేంద్రాన్ని త‌ప్పుబ‌ట్టారు .దీంతో ప‌వ‌న్ కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని అంద‌రు భావించారు. అయితే అంద‌రికి షాకిస్తూ పవ‌న్ మాయావ‌తి బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.అయితే ఇంత వ‌ర‌కు భాగానే ఉంది కానీ ...

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో బీజేపీ పై ఎలాంటి హ‌ద్దు మీరిన మాట‌లు మాట్లాడక‌పోవ‌డంతో ,ప‌వ‌న్ బీజేపి తెర‌వెనుకు స‌పోర్టు చేస్తున్నాడ‌నే వార్తులు వ‌చ్చాయి కానీ ...అవి అంత‌గా ప్ర‌భావితం చేయ‌లేదు .అయితే ప్ర‌స్తుత ఏపీ లో ఎన్నిక‌ల జ‌రిగిన తీరు స‌రిగా లేద‌ని చెప్పిన ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి ఎందుకు కొట్లాడ‌డం లేదు అనే సందేహాలు వెలువ‌డుతున్నాయి.ఏపీ లోని ప్ర‌జ‌లు కొట్టుకుంటే ఈసీ కి ఫిర్యాదు చేయ‌కుండా మౌనంగా ఉండ‌డం ఎంట‌ని ,ఎన్నిక‌ల ముందు మీకు నేనున్నా అని చెప్పిన ప‌వ‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం చాలా బాద‌క‌రం అని విశ్లేష‌కులు అంటున్నారు.ఇదంతా చూస్తుంటే తెర వెనుక నుండి ప‌వ‌న్ రాజ‌కీయ ల‌భ్ధి పోందే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల‌నుండి వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Related News