//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ శాసన సభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం..... ఏకగ్రీవ ఎన్నిక...

Category : politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి ముందు నుంచి కూడా పెద్దగా పోటీ లేని కారణంగా....ఈ పదవి కోసం ఒకే ఒక్కరి నామినేషన్ దాఖలు చేయడం తో ఈ పదవికి గాను తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రెండోరోజు ప్రారంభమైన శాసన సభలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శాసనసభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేశారు. తన తల్లి మరణం కారణంగా ఆయన బుధవారం అసెంబ్లీకి హాజరుకాలేకపోయారు. దాంతో ఆయన నేడు అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎంచుకోవడం తో ఆయనే స్పీకర్ గా ఎన్నికయ్యాడు.అంతే కాకుండా ఈ స్పీకర్ పదవికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్ వేశారు.

ఆయన నామినేషన్‌ను బలపరుస్తూ మంత్రులు బొత్స సత్యనారాయణ,బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో 30 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు గా సంతకాలు చేశారు. అనంతరం శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఈ నేపధ్యంలోనే ఆయన అనుభవాన్ని గౌరవిస్తూ ఈ పదవి ఆయకు దక్కడ సముచితం అని అందరూ తీర్మానించుకున్నరు.అలాగే స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎంపికకు ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.