ఐక్యరాజ్య సమితిలో నవ్యాంధ్రప్రదేశ్ కు విశిష్ట గౌరవం దక్కింది. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న ఐరాస యునెస్కో, యునిసెఫ్ కింద ఆర్థిక, సాంఘిక, సామాజికాంశాల పై అనేక సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా జరిగే ఈ సదస్సుల్లో భాగంగా అనేక దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. ఈసారి ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకై అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన పేరుతో ప్రత్యేక సమావేశం జరుపుతోంది. ఇందుకు భారత్ ను ఆహ్వానించింది. అయితే భారత ప్రతినిధిగా ఏపీని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఐరాసకు సమాచారం చేరవేసింది. మరోవైపు ఏపీకి ఇలాంటి గౌరవం ఇస్తు కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు లోటు బడ్జెట్ తో ఉన్న సంగతి తెలిసిందే.అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడి ఏపీని ప్రగతి పథంలోకి తీసుకెళ్లే పని చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వం 11.72 శాతం వృద్ధి సాధించింది. అందుకే నీతి ఆయోగ్ ఈ అంశాన్ని పరిశీలించి కేంద్రానికి సూచించింది. ఫలితంగా కేంద్రం ఏపీకి విలువైన అవకాశం ఇచ్చింది. భారత ప్రతినిధిగా అక్కడకు వెళ్లే వారు ఎవరైనా భారత్ తో పాటు ఏపీ అభివృద్ధి ఎలా సాధించింది. ఏ ఏ రంగాల్లో ఆ ఘనత సాధించిందనే విషయం పై వివరించాల్సి ఉంటోంది. మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా మాట్లాడటమే కాదు ఇందుకు తగిన గణాంకాలను జత చేయాల్సి ఉంటోంది. ఏపీ ప్రభుత్వం తమ ప్రతినిధిగా ఎవరిని ఎంపిక చేస్తుంది. ఏంటనేది త్వరలోనే ప్రకటించనుంది.