Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ ... ఫిబ్రవరి 15 న ముహూర్తం ఫిక్స్

Category : state politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అందరికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో అది కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ను రెడీ చేస్తుంది ఇంటర్నెట్ ను అందరికీ చేరువలో చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న నేటి తరుణంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అందరు నెట్ ను ఉపయోగించేలా చూడాలనే ఉద్దేశంతో ఈ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు జరుగుతుంది. టెక్నాలజీని ఇంటిపేరుగా మార్చుకున్న చంద్రబాబు ఫిబ్రవరి నుంచి అన్ని పురపాలక పట్టణాల్లో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నారు.

ఫిబ్రవరి 15 నుంచి ఆంధ్రప్రదేశ్లోని 110 మునిసిపాలిటీల్లో గుర్తించిన 970 ప్రాంతాలను వైఫై సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికిగాను గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఏపీలో జియో తన పూర్తి సేవలను అందిస్తోంది.

అయితే ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ పరంగా రాష్ట్రమంతా అభివృద్ధి చెందడానికి చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ ఉచిత సేవలను ఎంత వరకు ఉచితంగా ఇస్తారు ఇంకేమైనా నిబంధనలు ఉన్నాయా ఎంతవరకు నెట్ ను వాడుకోవచ్చు వాటి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. విధి విధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం ఇక భద్రతా పరమైన ఇబ్బందులు రాకుండా కూడా సాంకేతికంగా అన్ని చర్యలు తీసుకునే దిశగా ఈ నెట్ ను అభివృద్ధి చేస్తోంది. ఇది నిజంగా ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్.

Related News