అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు ఉంటాయన్నారు.
మార్చి11 నుంచి 20 వరకు బాండ్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరుగనుందని, దాదాపు 7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.