//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ ప్రభుత్వం ...!

Category : state

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తాజా గా ప్రకటించారు. తగ్గించిన ఈ ధరలు రేపటి ఉదయం అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ తగ్గింపుతో ప్రభుత్వానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గుతుందన్నారు. బీజేపీ వచ్చాక ఎప్పుడూ లేనంతగా ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల మీద కేంద్రం భారం వేసిందన్నారు. పెరుగుతున్న రేట్లు చూసి ప్రజలకు ఆవేదనతో ఉన్నారన్నారు.కేంద్ర చమురు సంస్థలు రోజురోజుకూ పెట్రో ధరలను పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ రోజు ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న బంద్‌కు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే దీనికి నిదర్శనం.

కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలు ప్రజలకు భారంగా మారాయి. ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించడానికి కేంద్రం నాలుగున్నరేళ్లుగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గర్హనీయం' అని బాబు అన్నారు.