//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చాకలి అని పిలిచారా ... అంతే సంగతి

Category : politics state

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాకలి, చాకలోడు అని పిలిస్తే జైలుకి పంపిస్తారు. ఆ పదాలు అవమానకరంగా ఉన్నాయని, అందువల్ల వాటిని నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రజకుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రజకులను ‘చాకలి’, ‘చాకలోడు’ తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి అవమానకర పేర్లను నిషేధించాలని ఏపీ వాషర్‌మెన్‌ సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఉత్తర్వులు జారీ చేశారు.

Related News