//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఖగోళ శాస్త్రం ప్రకారం టీడీపీ వస్తుంది...జాతకం ప్రకారం వైసీపీ వస్తుంది.. ఏది నిజం

Category : state politics

ఎన్నికల ప్రచారం ముగిసే టైం దగ్గరపడింది . ఈ సాయంత్రం తో ప్రచారం ముగుస్తుంది. ఇంతకముందు కాలంలో టీవీ యాడ్స్ కూడా ప్రచారం ముగింపు రోజు సాయంత్రం వరకే యాడ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఆలా కాదు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ ద్వారా ప్రచారం చేస్తున్నారు . ప్రతి చిన్న విషయాన్నీ కూడా చాలా పెద్ద విషయంలా చూపించడం అలవాటు అయిపోయింది .కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు గారికి 52 శాతం వున్నాయి అన్నవాళ్ళు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కి ఎక్కువ అవకాశం ఉంది అంటున్నారు .

ప్రస్తుంతం యూట్యూబ్ లో జగన్ సీఎం అవుతాడని కొందరు స్వామి పనికట్టుకొని మరి చెబుతున్నారు . అసలు నిజమెంత . ఖగోళ శాస్త్రం ప్రకారం రాష్ట్రములో మల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన " అన్నవరపు తిరుపతి అవధాని" గారు ఇప్పుడు ఉగాది నుండి మారిన జాతక ఫలాల వలన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్ గారికి జాతకంలో 100 శాతం వుంది అంటున్నారు . ఒక్క ఆయనే కాదు ప్రతిఒక్కరు ఇదే అంశం చెబుతున్నారు నిన్న మొన్నటివరకు మల్లి సీఎం చంద్రబాబు అన్న వాళ్ళు ఇప్పుడు జగన్ సీఎం అంటున్నారు అంటే ప్రజలనే కాదు వేదం చెప్పే పంతుళ్ళనికూడా గ్రిప్ లో పెట్టుకుంటున్నారు అన్న విషయం అర్ధం అవుతుంది . మరి శాస్త్రం ఆలా చెబుతుందో లేక శాస్త్రం తో ఆలా చేపిస్తున్నారో వాళ్లకే తెలియాలి .

Related News