Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

15 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల టెన్షన్ ... ఎందుకంటే

Category : politics state

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. టికెట్ల కేటాయింపు విషయంలో కూడా స్థానికంగా బలమైన నేతలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల లో 15 మంది పైన నియోజకవర్గాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో వారికి టిక్కెట్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు. ప్రజా క్షేత్రంలో వ్యతిరేకత ఉన్న వారికి టిక్కెట్లు కేటాయిస్తే ఓటమి పాలవుతామనే భావన జగన్మోహన్ రెడ్డి కి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసిపి నాయకులు ముఖ్యంగా టికెట్ ఆశావహులు టెన్షన్ పడుతున్నారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో పదిహేను మంది పరిస్థితి కాస్త తేడా ఉందని సమాచారం. ఈ మేరకు సర్వేల్లో వెల్లడి అవుతున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వీరిలో ఐదేళ్లు గడిచే సరికి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దీనికి పలు కారణాలున్నాయి. ప్రతిపక్ష పార్టీ లో ఉండడంవల్ల అధికార పార్టీ నుండి నిధులు రాక నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. స్థానికంగా ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో, అభివృద్ధి శూన్యంగా నియోజకవర్గాలను ఉంచడంతో వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ప్రత్యేకమైన దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు నియోజకవర్గాల దూసుకుపోయేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయా నియోజకవర్గాల్లో టిడిపి బలపడేలా చేశారు. ఇక ఇదే వైసిపికి మైనస్ అయింది.

మరి వీరి టికెట్ల విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిదాయకమైన అంశం. ప్రతిపక్షాల ఉన్నప్పటికీ పార్టీని వీడి వెళ్లకుండా పార్టీ కోసం పని చేసినందుకు జగన్ వారికి అవకాశం ఇస్తారా? లేక మిత్రులకు పట్టు కోల్పోయినందుకు వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు పరిగణలోకి తీసుకున్న జగన్ వారికి టిక్కెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఏది ఏమైనప్పటికీ వైసిపి ఆశావహుల్లో మాత్రం టికెట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ కనిపిస్తోంది.