//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో ఎల్లుండే ఎలక్షన్ నోటిఫికేషన్ ..అమలులోకి రానున్న కోడ్

Category : state politics

ఒకవైపు పోరాటాలతో, మరోవైపు సభలతో హోరెత్తిపోతున్న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చిలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్‌ విడుదల కానుంది…

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవనున్న మరో ఐదు స్థానాలతో పాటు ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దాదాపుగా సగం పైగా రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్‌ అమల్లోకి రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు వర్తించే అవకాశముంది. ఆ తరువాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది.

ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలోనే వస్తే, ఇటు ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్‌, ఆ వెంటనే సాధారణ ఎన్నికల కోడ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉండవచ్చు. మొత్తానికి ఎన్నికల కాలం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అందులో భాగంగానే ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది.