//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీకి బాబు వార్నింగ్...!

Category : politics

నిన్నరాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తొలి అడుగు మాత్రమేనని, ఇంకా ముందు ముందు ఆలోచించి మరిన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోకడానికి వెనుకాడబోమని చెప్పారు

దీని ప్రకారంగా చుస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందుముందు మరిన్ని షాకులిచ్చేందుకు సీఎం నిర్ణయించుకున్నట్టు సమాచారం. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పారు.

ఎన్డీయే సర్కారు నుంచి తమ మంత్రులు రాజీనామా చేస్తారని, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలిగే టీడీపీ, ఎన్డీయేలో మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. పూర్తీ ఎన్డీయే లోనుంచి బయటకు వచ్చే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.