//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్లా లేనట్లా ?

Category : politics state

అయితే ఫెడరల్ ఫ్రంట్ పెడతా అని అంటున్న కెసిఆర్ గారు ఇప్పటి వరకు ఎలాంటి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోగా చంద్రబాబు మాత్రం దేశ రాజధాని లో ధర్మ పోరాట దీక్ష చేస్తూ అన్ని రాష్ట్రాల పార్టీ ల మద్దతు తో తన సామర్ధ్యాన్ని దేశ వ్యాప్తంగ మోడీ కి వ్యతిరేక పవనాలు రేకెత్తిస్తున్నాయి . ఇంకా రెండు నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎల్లెక్షన్స్ దేశ రాజకీయాల్లో వేడిని రేకెత్తిస్తున్నాయి .

ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రము లో ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలతో తమదే విజయం అనే ధీమాలో ఉన్నారు .అయితే చంద్ర బాబు మాత్రం ప్రత్యేక హోదా కొరకు ఇటు ఆంధ్ర లో అలాగే దేశ రాజధాని ఢిల్లీ లో దీక్ష లతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం లో ఉన్నారు .ఇది ఇలా ఉండగా గత వారం గుంటూరు లో జరిగిన మోడీ సభ ఫలితం ఇస్తుందా దక్షిణ భారతం లో ఇవ్వదా అనేది చూడాల్సి ఉంది .దేశ రాజకీయాల్లో కి వెళ్ళాను అని చంద్రబాబు అంటున్నప్పటికీ ఢిల్లీ రాజకీయాల్లో తన పాత్ర ఉండాలి అని తన మనసులో మాటలని చెప్పకనే చెబుతున్నారు .

కెసిఆర్ మాత్రం ఫెడరల్ ప్రెంట్ మాట తీస్తూ దేశంలో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీడియా ముందు అంటున్నారు .మరో రెండు నెలల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి .ప్రతి పక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల ప్రాంతీయ మరియు అధికార పార్టీల సహకారాన్ని కోరుకుంటూ ముందుకు సాగుతుంది .అయితే మోడీకి ఎప్పటినుండో వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్ర బాబు మాత్రం వచ్చిన ఎ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు .

గత వారం బెంగాల్ లో జరిగిన సిబిఐ సంఘటన కి సంబంధించి మమతా బెనర్జీ దీక్షకు చంద్రబాబు మద్దతు తెలపడం జరిగింది .అదే దీక్ష లో మమతా కెసిఆర్ ను ఇలా ప్రశ్నించింది ఫెడరల్ ప్రాంట్ అని అన్నావ్ గా కెసిఆర్ ఎక్కడున్నావ్ ఎప్పుడు రా అని .ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ మరియు మోడీలు దేశ రాజకీయాల్లో పతనం కావాల్సి వచ్చేలా ఉంది .అటు ఏపీలో మాత్రం మళ్ళీ చంద్రబాబు అధికారం లో కి వచ్చేందుకు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు . ఇలా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా తన రాజకీయ చతురతను చాటుతున్నారు ..