Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ సీఎం జగన్ పై రెచ్చిపోయిన జేసీ తనయుడు.!

Category : politics

పాలిటిక్స్ అన్నాక అధికార పక్షం ప్రతిపక్షాన్ని, అలాగే ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శలు చెయ్యడం సర్వ సాధారణం. అయితే కొత్తగా ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వంపై మరియు ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ పై ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.తాజాగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు అయినటువంటి జేసీ పవన్ కుమార్ రెడ్డి జగన్ నెల రోజుల పరిపాలనపై రెచ్చిపోయారు.ముఖ్యంగా జగన్ ఇచ్చిన నవరత్నాలపైనే టార్గెట్ చేస్తూ తన విమర్శలను పవన్ చేసారు.

జగన్ తాను ఇచ్చిన ఏ ఒక్క మాటలో కూడా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేసారు.జగన్ మొట్టమొదట సంతకం పెట్టిన పెన్షన్ పథకం నుంచే అబద్దపు హామీలు మొదలయ్యాయి అన్నట్టుగా మాట్లాడారు జగన్ ముందు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారని కానీ ఇప్పుడు కేవలం 250 మాత్రమే పెంచి వృద్ధులను మోసం చేసారని వ్యాఖ్యానించారు.ఇక అలాగే జగన్ ఇచ్చిన అమ్మఒడి పథకం అసలు ప్రయివేటు స్కూళ్లకా లేక ప్రభుత్వ స్కూళ్లకా అన్నది కూడా ముందు ఏమి చెప్పకుండా ఓట్ల కోసం హామీలు ఇచ్చుకుంటూ వచ్చారని జగన్ తన నెల రోజుల పరిపాలనలోనే తీవ్రమైన వ్యతిరేకతను ప్రజల నుంచి పొందారని రెచ్చిపోయారు.

Related News