//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ తో తెగదెంపులకు రంగం సిద్ధం చేస్తున్న ఏపీ సీఎం...!

Category : politics

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు తీవ్ర స్థాయి లో ఉన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కీలక నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావల్సివుంది. అది ఏ విషయం అనేది ఏపీ ప్రజలకు బాగా తెలుసు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చేది లేదు అని కేంద్ర ఆర్థిక శాఖ నిన్నఏపీ ఎంపీ లతో చెప్పిందని సమాచారం. దేశంలోని ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో లిఖితపూర్వకంగా చెప్పేశారు.

నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్న కు స్పందించిన ఆర్థిక శాఖ సహాయక మంత్రి హోదా అనేది ఏపీ కి ఇవ్వలేము అని తేల్చేసారు. ఇక మంత్రి పార్లమెంటులో సమాధానం ఇచ్చారంటే ఇది అధికారికంగా చెప్పినట్లే అని అనుకుంటున్నారు అందరూ.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో ప్రత్యేక హోదాపై, హామీలపై చర్చలు జరపడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, రామ్మోహన్‌ నాయుడు తదితరులు చర్చలకు వెళ్లిన తరువాత ఇలాంటి రావడం ఇక్కడ మరో విశేషం.

ఇక చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై ఢిల్లీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా లేవని అన్నప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే ప్రకటన వచ్చింది. దీంతో సీఎం భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేదానిపై చర్చ జరిగింది.

తరువాత అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు బీజేపీ విషయం లో ఎలా ముందుకు పోవాలి అని తమ పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో 95 శాతం మంది బీజేపీ తో తెగదెంపుకు సపోర్ట్ చేసారు,కేవలం కొంతమంది మాత్రమే వేచిచుదాం అని చెప్పారని సమాచారం.దీనిపై చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీ లో మాట్లాడనున్నాడు.

అలాగే ఈ రోజు సీఎం ఢిల్లీ లో ఉన్న ఎంపీ లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.మీరు పార్లమెంట్ లో నిరసన ల పర్వాన్ని కొనసాగించండి అని చెప్పారని అసెంబ్లీ వర్గాల సమాచారం. సీఎం కూడా ప్రజా అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు ఈ విషయం లో అలంటి నిర్ణయం తీసుకున్నటారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు, ఎప్పటిలాగే ఈసారికూడా సీఎం వేచిచూసే ధోరణిని పాటిస్తాడా లేక తెలంగాణ సీఎం కెసిఆర్ కోవలో కేంద్రం ఫై యుద్ధంప్రకటిస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఏపీ ప్రజలు మాత్రం బీజేపీ నుండి బయటికి వచ్చి నిరసన లను మరింత తీవ్రతరం చేయాలనీ అనుకుంటున్నారు.

Related News