//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Category : politics state

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రపంచ ప్రజలు ఎవరీ చంద్రబాబు అంటూ గూగుల్ లో వెతకటం మొదలు పెట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. Ap CM Chandrababu Speech main two topics At Ikya Rajya Samiti

అయితే చంద్రబాబు తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఇందులో భాగంగా రసాయన ఎరువుల వాడకం వలన పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన ఆవేదన వక్త్యం చేసారు. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కుందని, ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు అన్నారు.Ap CM Chandrababu Speech main two topics At Ikya Rajya Samiti

ప్రకృతి వ్యవసాయం వలన రైతులకు పెట్టుబడుల బాధ తగ్గిందని, అధిక దిగుబడులు సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదని పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు అన్నారు. అందుకే ఏపీ లో ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శమన్నారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ని అన్నపూర్ణ అని అంటరాని చంద్రబాబు అన్నారు. Ap CM Chandrababu Speech main two topics At Ikya Rajya Samiti

Related News