Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సంచ‌ల‌నం.. జగన్ కు ముచ్చెమ‌ట‌లు ఖాయ‌మేనా...

Category : state politics

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను శనివారం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రేపు ఉగాది సందర్భంగా టీడీపీ మేనిఫెస్టో విడుదలచేయనున్నట్టు చెప్పారు. ఎల్లుండి (ఆదివారం) అన్ని ప్రార్ధనా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ హక్కులను కాలరాశారని నిలదీసినందుకే..

టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీని నిర్వీర్యం చేయడం ద్వారా.. ఏపీకి నష్టం చేయడంపై నిరసనలు తెలుపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.జగన్‌, కేసీఆర్‌తో ఏపీపై పెత్తనం చేయాలని బీజేపీ యత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 8న మహిళలతో సంఘీభావ ప్రదర్శనలు తెలుపుతామని, 10న రాష్ట్రవ్యాప్తంగా పసుపు దీక్ష చేపడతామని, మహిళలు, యువత, రైతులు పసుపు దుస్తులు ధరించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.