Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం చంద్రబాబు ధర్నా..ఎందుకో తెలుసా..?

Category : state politics

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో ధర్నా చేశారు. టీడీపీ అభ్యర్థులు, మద్దతుదారులపై ఐటీశాఖ దాడులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఐటీ సోదాలు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు.

ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత.. ప్రతి అంశం ఈసీ మార్గదర్శకాల ప్రకారం వెళ్లాలని, కానీ ఒకే ఒక పార్టీని టార్గెట్ చేయడం దారుణమని బాబు అన్నారు. ఐటీ దాడులతో ఒక పార్టీని అణగదొక్కి, మరో పార్టీకి మద్దతు ఇవ్వడం సరికాదు అని చంద్రబాబు తెలిపారు.కడప జిల్లాలో టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఇంట్లో ఇవాళ ఐటీశాఖ సోదాలు చేసింది. సుమారు 50 మంది పోలీసులు సీఎం రమేశ్ ఇంట్లోకి వెళ్లి సోదాలు చేశారు.

సీఎం రమేశ్ బెడ్‌రూంలోకి పోలీసులు వెళ్లారని తెలిసింది. దీంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. సెర్చ్ వారెంట్‌తో వచ్చారా అని పోలీసులను సీఎం రమేశ్ నిలదీశారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Related News