Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ గనుక అధికారం లోకి వస్తే వీధికొక్క రౌడీ పుట్టుకొస్తాడు....చంద్రబాబు కామెంట్స్

Category : state politics

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్ కేంద్రంగా 9 ఏళ్ల పాటు సీఎంగా, 10 ఏళ్ల పాటు ప్రతిపక్షనేతగా పనిచేసిన అనుభవం తనదని ఆయన చెప్పారు.అలాంటి తనకే తెలంగాణ లో గౌరవం లేకుండా పోయిందని బాబు గుర్తు చేశారు.తెలంగాణ లో కేసీఆర్ సీఎం అయ్యాక..ఆయన తన ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నాడని చెప్పారు . తనతో పాటు ఏపీ ప్రజలను కూడ ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తానే కూర్చొనేందుకు కనీసం కుర్చీ కూడ లేకుండా చేసారని . ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఇన్ని అవమానాల తరువాత హైద్రాబాద్ కంటే అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బాబు చెప్పారు.

వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ చంద్రబాబు కొన్ని బలమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సారి ఎన్నికల్లో చావడమో, చంపడమో ఉంటుందని ఓ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనిల్ కుమార్ చేసిన ప్రకటనపై చంద్రబాబునాయుడు ఘాటుగానే స్పందించారు.ఇక పై అలా మాట్లాడితే నేరుగా జైలుకే వెళ్తారని ....నేరాలకు , హత్యలకు ప్రేరేపిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకోనని చంద్రబాబు స్పష్టం చేసారు. హత్యలు చేస్తామంటే శాశ్వతంగా జైల్లోనే ఉంటారని. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎవరికైన చివరికి జైలే గతి అవుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.ఇలాంటి వ్యక్తులతో కూడిన వైసీపీ పార్టీ గనుక అధికారంలోకి వస్తే వీధికో రౌడి పుట్టుకొస్తాడని బాబు ధ్వజమెత్తారు. అలాగే పులివెందులో జగన్ చెడపుట్టాడని చంద్రబాబు విమర్శించారు. పులివెందుల ప్రజలు చాలా మంచి వాళ్ళని..అందుకు నిదర్శనం పులివెందులలలో తాను నిర్వహించిన సభకు అక్కడి జనం బ్రమ్మరథం పట్టడమే అందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు