//single page style gallary page

AP CM Chandrababu Naidu Sensational Comments on PM Modi

Category : national politics

Click here to read this article in Telugu

ప్రధాని పై నిప్పులు చెరిగిన చంద్రబాబు..!

ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా చంద్రబాబు గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జవాబుతారీ తనం లేని ప్రధానిని దేశం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని అన్నారు. ట్విట్టర్ లో ప్రధాని లక్ష్యంగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ పాలనలోనే దేశంలో ఎప్పుడూ లేనంతగా అంత:కలహాలు పెచ్చుమీరాయని చంద్రబాబు ఆరోపించారు. స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లలో దేశం చూసిన ప్రధాన మంత్రుల్లో అస్సలు జవాబుదారీతనం లేని ప్రధాని మోదీయే అని పత్రికారంగం కూడా చెప్తుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అదే విధంగా ట్విట్టర్ లో ప్రధాని మోదీ పాలనపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధానిగా మోడీ తప్ప మరెవరూ లేరంటూ ఆయన మండిపడ్డారు. అదే విధంగా గత ఏడాది సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో మొదటిసారి నలుగురు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు బయటికొచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీడియాతో చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు.ఇక రాఫెల్ పత్రాల మాయం గురించి కూడా చంద్రబాబు ట్విట్టర్ ప్రస్తావిస్తూ మోడీ లక్ష్యంగా, బిజెపి లక్ష్యంగా విమర్శలు చేశారు. చరిత్రలో తొలిసారిగా సాక్షాత్తూ రక్షణశాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు (రఫేల్‌) ఎప్పుడైనా మాయం అయ్యాయా అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు. ఇక బ్యాంకింగ్ రంగం కుదేలవ్వడంపై స్పందించిన చంద్రబాబు, మోదీ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా మార్చేశారని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్టి నిర్ణయాల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. నోట్ల రద్దును పెద్ద కుంభకోణంగా మార్చారని..

జీఎస్టీని సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అదే విధంగా మోదీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పతనం అయిందని ఆరోపించిన చంద్రబాబు… 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదని మండిపడ్డారు. కాగా మోడీ ఇప్పటి వరకు ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయని సంగతి తెలిసిందే.తాను మాట్లాడాలి అనుకున్నది మాట్లాడటం తప్ప దేశీయ లేక విదేశీ విలేఖరులతో ఒక్కసారి కూడా సమావేశం పట్టకపోవటం దేశ చరిత్రలోనే ఇప్పటివరకు జరగలేదు. మౌన ప్రధాని అన్న ముద్ర ఉన్న మన్ మోహన్ సింగ్ కూడా ప్రతి సంవత్సరం ఆర్ధిక అంశాల గురించి, విదేశీ వ్యవహారాల గురించి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసేవారు. కానీ అన్నిట్లో గొప్ప అని చెప్పుకునే మోడీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు.

Prime Minister Narendra Modi targets Chandrababu on Thursday. He said that the country has never seen the Prime Minister before. Chandrababu is the prime target in Twitter. Chandrababu alleged that the Prime Minister was under the rule of Modi, and that there was never any more in the country. Chandrababu tweeted that Modi was the prime minister who did not have any accountability in the country's prime ministers after 70 years of independence.

Similarly, Chandrababu has made vital statements on Prime Minister Narendra Modi's rule in Twitter. He ignored Modi as the prime minister who did not even have a media conference. Similarly, Chandrababu referring to a media conference organized by Supreme Court judges last year. Chandrababu has criticized Chandrababu for the first time in four of the Supreme Court judges in the country and told democracy that the democracy was in danger. The BJP was targeting Modi as the target of Modi's Rafael papers. Chandrababu questioned whether the documents of the national security (Rafael) had been changed at any time in the defense ministry for the first time in the defense ministry. Responding to the banking sector, Chandrababu expressed concern over the people's confidence in the banking system in the Modi regime. In the same way, Twitter has made it clear that the ATMs were transformed into scabies. Chandrababu also refuted the GST's decision to cancel the banknotes. The bankruptcy of the banknotes has become a big scandal.

Chandrababu criticized the failure of the GST for failing to implement properly. Chandrababu alleged that the value of rupee has fallen in the Modi regime as well as in the 72-year-old's independence. Modi has not yet formed a single media conference. I do not have a meeting with the foreign or foreign reporters in the country's history so far. Manmohan Singh, who is the silent Prime Minister, also set up a press conference on economic issues and foreign affairs every year. But Modi has said that it's great, but it has not held any meetings yet.