//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు నాయుడు రియల్ లైఫ్ స్టోరీ...

Category : state politics history

చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు వుండరు తెలుగు రాజకీయాల్లో నలభై ఏళ్లపాటు చెరగని ముద్ర వేసుకున్న ఆ నాయకుడు మన చంద్రబాబు. ఒక వ్యక్తి శక్తి గా మారాలంటే నాయకుడు అవ్వాల్సిందే మరి, ఒక సామాన్యుడు నాయకుడు అవ్వాలంటే దానికి పొలిటికల్ బాక్గ్రౌండ్ ఉండాలి, కానీ ఆయనకు రాజకీయ నేపద్యము లేదు, ఆ కుటుంబం లో ఒక్క నాయకుడు లేడు, తండ్రి ఓ సామాన్య రైతు ,తల్లి ఓ కష్ట జీవి కానీ అయన మాత్రం తెలుగు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయాణం సాగిస్తున్నాడు అతడే నారా చంద్రబాబు నాయుడు.

తెలుగు రాజకీయ చరిత్రలో ఆయనో ఓ అధ్యాయం, అధ్యనం చేసేవారికి తరగని రాజకీయ గని అయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అనితరం సాధ్యం, వ్యూహరచనకు ఆయనను మించిన వారెవ్వరు లేరన్నది ఎందరో అంగీకరించిన వాస్తవం. రాష్ట్ర రాజకీయాల్లో తో పాటు కేంద్ర రాజకీయాల్లోనూ తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న నాయకుడు ఆయన అందుకు తొలి అడుగు నుంచి నేటి వరకు ఆయన చేసిన కృషి గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట అధినేత గా దేశ రాజకీయాల్లో కీలక నేత గా, ఒక పవర్ ఫుల్ పొలిటిషన్ గా, ఒక పర్ఫెక్ట్ పొలిటిషన్ గా, ఒక ప్రొఫిషనల్ పొలిటిషన్ గా, నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని ప్రయాణం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు.

ఒక సామాన్యుడు రాష్ట్రా రాజకీయాల్లో చెరగని ముద్రవేసాడు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు . రాజకీయాల్లో భిన్న దృవాలుగా వున్నా పార్టీలను ఒకే వేదిక పై కుర్చోపెట్టాడు . కుటుంబం లో రవ్వంత రాజకీయ నేపద్యంమ్ లేదు , ఫ్యామిలి లో అంతకు ముందు ఆ ఆలోచనలు లేకపోయినా ఆయన పాలిటిక్స్ లో నిండు చంద్రుడిగా వెలుగెడుతూ వచ్చారు . చిన్నతనం నుంచే ప్రజాసేవ చేయాలన్న ఆసక్తితో అడుగు లేసి గ్రామీణ ఆర్థికాభివృద్ధి గురించి పరిశోధనలు చేసి పాతికేళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయకుడు ఆయన తెలుగు రాజకీయాల్లో పిన్న వయసులోనే MLA అవ్వటమే కాదు ఇరవైఎనిమిదేళ్లకే రాష్ట్ర కాబినెట్ లో చోటు దక్కించుకున్న లీడర్ ఆయన .

చంద్రబాబు అనగానే గుర్తుకొచ్చే మొదటి మాట బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని రాజకీయాల్లో పొలిటిసియన్ లే కానీ అడ్మినిస్ట్రేటర్ లు వుండరు, కానీ చంద్రబాబు ఇమేజ్ లో ఈ రెండు ఉంటాయి. స్టూడెంట్ పాలిటిక్స్ లో తొలి అడుగులు వేసి గ్రామీణ ఆర్థికాభివృద్ధి గురించి పరిశోధనలు చేసి పాతికేళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాయకుడు ఆయన డిజిటల్ స్పీడ్ తో పరుగులు పెట్టించిన ఆయనే తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘంగా రాష్ట్రాన్ని ఏలిన సీఎం గా రికార్డులు సృష్టించింది ఆయనే , పదియేళ్లపాటు ప్రతిపక్షనేతగా అలుపెరగని పోరాటం చేసింది ఆయనే, దేశం లో అత్యంత వ్యూహాత్మక రాజకీయ వేత్త గా పేరు తెచ్చుకున్న నాయకుడు , ఎన్ని సార్లు ఎదురు దెబ్బలు తిన్న, తింటున్న తనలో పోరాట ప్రతిమ రవ్వంత కూడా తగ్గకుండా దూసుకెళ్తున్న పొలిటికల్ మిస్సయిల్ ఆయన.

రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ సంచలనం అయితే ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి అందగాడు తర్వాత చంద్రబాబు మరో సంచలనం ఆయన జీవితం లో ఏ క్షణాన్ని తెరచి చూసిన పొలిటిక్స్ ఏ కనిపిస్తాయి. సమకాలీన రాజకీయాల్లో అంత సీరియస్ పొలిటిషన్ మరొకరు లేరంటే అతి సయోక్తి కాదు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీ పందాన్నే మార్చేసి తన విధానాలతో తెలుగు తమ్ముళ్లు లోను తన నినాదాలతో రాష్ట్ర అభివృద్ధిలోనూ నూతనోత్సాహాన్ని నింపిన నాయకుడు ఆయన సంస్కరణలకు రూపం పోయటం లోనే కాదు ప్రపంచానికి తెలియని అడ్మినిస్ట్రేటర్ టెక్నిక్స్ తో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం నింపిన లీడర్ ఆయన జన్మభూమి ప్రజల వద్దకు పాలన వంటి పథకాలతో అధికారులను పరుగులు పెట్టించిన ఏకైక సీఎం ఆయన రాష్ట్ర యువతకు ఐటీ ఫలాలు అందించిన హైటెక్ సీఎం ఆయన , పరిపాలనలో వినూత్మక సంస్కరణలకు ప్రాణం పోసిన నేత ఆయన. పార్టీ నేతలకు చెరిగిపోని మార్గ నిర్దేశం చేసి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు , రాజకీయ ఎత్తుగడల్లో వ్యూహాల్లో ఆయనో అపర చాణిక్యుడు కేంద్రం లో కూడా చక్రం తిప్పి అక్కడ కాంతులీలిన చంద్రుడు అడ్మినిస్ట్రేటివ్ గా క్రమశిక్షణగా తన సైన్యాన్ని ముందుకు నడిపించడం లో ఆయనకు ఆయనే సాటి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ యువ సంచలనం చంద్రబాబు నాయుడు. అధినేత గా, పార్టీ సీఎం గా రాష్ట్రాన్ని తన దైన శైలితో ముందుకు తీసుకెళ్లారు. జస్ట్ మన రాష్ట్రానికే తెలిసిన హైదరాబాద్ ను అంతర్జాతీయ ఐటి యవనికపై నిలబెట్టారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర రాజకీయ ,ఆర్ధిక పరిపాలన ముఖ చిత్రాన్ని మార్చివేశారు. ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్న ఈ చంద్రుడు మన చంద్రబాబు నాయుడు .