Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు ఏం చెప్పారంటే..?

Category : state politics

జిల్లాలోని టీడీపీ నేతలు, అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు హరిత హోటల్‌లో సమావేశం అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై వారితో చర్చించారు. సుమారు 20 నిముషాలపాటు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

బయటనుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, టీడీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేతలకు సూచించారు. కాగా కర్నూలులో సమావేశం అనంతరం సీఎం కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. అక్కడ రాయచూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు.