//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం సర్వే లో బయటపడ్డ అసలు నిజం ..వారికీ ఇక మూడినట్టే .!

Category : politics state

నమస్కారం... నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను... మీ నియోజకవర్గ ఎమ్మె ల్యే పనితీరు ఎలా ఉంది...? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా... అవినీతి రహిత పాలన అందిస్తున్నారా.. సంక్షేమ కార్యక్రమాల్లో అందర్ని కలుపుకొని వెళుతున్నారా’.. అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు .

ఎన్నికలకి మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటం తో బాబు తన యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నాడు . గత కొద్దిరోజులుగా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు వాయిస్‌తో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు . ఈ దెబ్బ తో ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్‌ కాల్స్ హోరెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరుపై విభిన్న కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని , దీనితో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అభ్యర్థిత్వాల వైపు మొగ్గుచూపాలనేది నిర్థారించుకొనే క్రమంలో గత కొన్ని నెలల నుంచి రకరకాల పద్దతుల్లో సర్వే చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని బృందాలు ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడంలో తలమునకలై ఉన్నారు . వారం రోజులుగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లకు పదేపదే కాల్స్ చేస్తూ ఉన్నారు . ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒకసమయంలో ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిస్‌ రికార్డుతో 8333999999 అనే నెంబర్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల తోపాటు ఇతర పార్టీల్లో ఉన్న వారికిసైతం ఈ ఫోన్‌లు రావడంతో మెజార్టీ శాతం ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం మెజారిటీ శాతం మంది టీడీపీ పనితీరుపై కొంచెం పాజిటివ్ గా నే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది . అలాగే అక్కడక్కడ కొంతమంది పై నెగెటివ్ టాక్ కూడా బయటపడింది . దీని పై త్వరలో నే చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించబోతున్నాడు . దీనితో ఎవరి పరిస్థితి ఎలా ఉందొ , సీటు ఉంటుందో , ఆడుతుందో తెలియక కొందరు నేతలు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు .

Related News