//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 67వ జన్మదినం సందర్భంగా

Category : state politics editorial

నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు,అంతెందుకు మన దేశం లోని ఉండకపోవచ్చు. ఇంకా ప్రపంచంలోని చాలా దేశాల్లో చాలా మందికి ఈయన గురించి తెలుసు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేసి హైదరాబాద్ ని ప్రపంచం అంతా గుర్తించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. ఇప్పుడు విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి అమరావతి ని ఒక అద్భుతమైన రాజధాని గా తీర్చిదిద్దటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, ఈ వయసులో అభివృద్ధి కోసం రోజుకు ఇన్ని గంటలు కష్టపడే నాయకుడు ప్రపంచంలోనే మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఆయన ఎదుర్కొనే తీరుని ప్రత్యర్థులు కూడా తమ అంతర్గత సంభాషణల్లో అభినందించకుండా ఉండలేరు.అందుకే అభిమానులు ఆయనను 'క్రైసిస్ మేనేజ్మెంట్ గురు' అని పిలుచుకుంటారు.అలాగే భవిష్యత్ ని ముందుగా ఊహించి దానికి తగ్గ ప్రణాళికలు అమలు చేయటంలో ఎప్పుడు ముందే ఉంటారు.దానికి తార్కాణమే ఆరోజుల్లో హైదరాబాద్ లో ఆయన నాటిన IT విత్తు.అది ఈనాడు మహావృక్షమై ఎందరికో ఫలాలు అందిస్తున్నది.

ఇవే కాకుండా పాలనలో ఆయన తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వం ఈ రోజు సామాన్యుడికి ఎంతో చేరువలోకి వచ్చింది. వాటిని ఆదర్శముగా తీసుకొని దేశం లోని మిగతా రాష్ట్రాలు కూడా అవలంబించి మంచి ఫలితాలు సాధించారు.ఈనాడు గ్రామాల్లో మహిళలు ఎంతో కొంత స్వయం ఉపాధి సాధించారంటే అది ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిన డ్వాక్రా గ్రూప్ ల చలువ వల్లే.
జన్మభూమి,శ్రమదానం, రైతుబజార్లు,నీరు-చెట్టు,ఇంకుడు గుంతలు,చెక్ డ్యామ్ వంటి ఎన్నో కార్యక్రమాలకు ఏళ్ల క్రితమే రూపకల్పన చేసిన ఆలోచనపరుడు.

ఆయన ఏ కార్యక్రమం చేపట్టిన విన్నూత్నముగా ఆలోచిస్తూ ముందుతరాల భవిష్యత్ కి ఉపయోగపడే విధముగ తీర్చిదిద్దుతారు.అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన తరువాత భారీ ఆదాయలోటు,రాజధాని కూడా లేని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి బరువును ఆయనకి అప్పచెప్పారు.
కానీ ఆయనెప్పుడు దానిని బరువుగా భావించక ఒక బాధ్యతగా,ఒక సదవకాశంగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళటానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారు.రాజధాని కోసం ఒక్క లాఠీఛార్జ్ కూడా జరగకుండా రైతుల నుంచి భూసమీకరణ పద్దతి లో 33వేల ఎకరాలు అతి తక్కువ కాలంలోనే సేకరించి సచివాలయం, శాసనసభ వంటి తాత్కాలిక భవనాలు నిర్మించి భవిష్యత్ కై బాటలు వేశారు.ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ కి చంద్రబాబునాయుడి లాంటి నాయకుడి,కార్యదక్షుడి అవసరం ఎంతయినా ఉంది.

ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ


మీ INS Media