Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోట్ల చేరిక లో మెలిక.. జమ్మలమడుగు తుది నిర్ణయం ఇదే?

Category : politics state

కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయాలు సీఎం చంద్రబాబు వద్దకు చేరాయి. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరిక వ్యవహారంలో కేఈ కుటుంబం కొన్ని అభ్యంతరాలు చెబుతోంది. డోన్ నియోజకవర్గం విషయంలో ఇరువర్గాలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేఇ బ్రదర్స్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే కోట్ల చేరిక అంశంపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

అటు రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు పంచాయితీ కూడా చంద్రబాబు చెంతకు చేరింది. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య గతంలోనే రాజీ ఫార్ములా వారిముందుంచిన చంద్రబాబు మరోసారి వారితో మాట్లాడనున్నారు. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేలా వారి మధ్య రాజీ ప్రయత్నం చేశారు. దీనికి గతంలో అంగీకరించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీగా పోటీచేసేవారు ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అధినేత హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related News