//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ ను టార్గెట్ చేసిన టీడీపీ అధినేత....నేతలకి దిశానిర్దేశం....!

Category : politics

తెలుగుదేశం పార్టీని, ఏపీ సర్కారును టార్గెట్ చేసుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే విమర్శలపై దీటుగా స్పందించాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ మంత్రులు, నేతలకు ఆదేశాలు అందినట్టు సమాచారం.

పవన్ విమర్శలపై గట్టిగా ప్రతిస్పందించాలని, ఆయన చేసే ఆరోపణలలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా విమర్శనాస్త్రాలకు పదును పెట్టాలని టీడీపీ నాయకత్వం కింది స్థాయి నేతలకు సూచించింది.

ఇప్పటివరకూ పవన్ ఆరోపణలపై తెలుగుదేశం నేతలు ఆచితూచి స్పందిస్తుండగా, దీనివల్ల కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని భావించిన పార్టీ పెద్దలు, ఇకపై ఆయన విమర్శలను తీవ్రంగా తిప్పి కొట్టాలని తేల్చారు. ఎన్నికల వేళ పవన్ ఆరోపణల ప్రభావం ఓటర్లపై పడకుండా చూసేందుకు ఎదురుదాడి చేయడమే సరైన మార్గమని, వైకాపాపై ఎలా విరుచుకుపడుతున్నామో, పవన్ పై కూడా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించాలని చంద్రబాబు నుం

Related News