Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ పోర్టల్ లాంచ్ చేసిన చంద్రబాబు నాయుడు....

Category : politics

టీడీపీ ఎన్నికల హామీలలో ఒకటైనా ‘నిరుద్యోగ భృతి’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. అక్టోబర్‌ నుంచి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసారు. దానికి సంబంధించి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్‌ సైట్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. నిరుద్యోగ భృతి సంబందించిన సమాచారమే కాకుండా ఉపాధి, శిక్షణ, సంస్థలు, నిరుద్యోగుల సమాచారం కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందని చంద్రబాబు అన్నారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసుండి ఏడాది క్రితం డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసిన తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఈ భృతికి అర్హులని ప్రకటించింది. ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయగానే అర్హత సమాచారం కనిపిస్తుంది

‘వెబ్ సైట్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఇదో చారిత్రక పథకం. సుదీర్ఘ అధ్యయనం, కసరత్తు తర్వాత పథకం అమలు చేస్తున్నాం. చరిత్ర సృష్టించబోతున్నాం. నా మనసుకు దగ్గరైన పథకం ఇది. యువత ప్రపంచాన్ని జయించే అంత శక్తిమంతులు కావాన్నది నా ఆకాంక్ష’ అని అన్నారు. కొన్ని రాష్ట్రాలలో విఫలమైన, మరి కొన్ని రాష్ట్రాలలో సక్సెస్ అయ్యుందని అన్నారు. సుదీర్ఘ అధ్యనం తరువాత కొన్ని మార్పులతో ఈ పధకాన్ని ప్రవేశ పెట్టినట్టు అయన తెలిపారు.