Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో నోటిఫికేషన్ విడుదల ... నామినేషన్లు వెయ్యొచ్చు .. ఈసీ

Category : politics state

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, జిల్లాలలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్‌లను అధికారులు తీసుకుంటారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉంది. 26న నామినేషన్ల పరిశీలన చేసి, 28వరకూ ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన నిర్వహించనున్నారు.

Related News