//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

Category : politics

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి ఐదు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా చర్చించారని సమాచారం.ప్రత్యక హోదా ఫై ముందు కు ఆలా సాగాలని చర్చించారు.సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలు :

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2.096 శాతం విడుదలకు ఆమోదం

2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు,15 నెలల డీఏ రూ. 1048 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం

పోలవరం కాంక్రీట్‌ పనులు చేపట్టిన నవయుగ కంపెనీకి రూ. 1244 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు

విద్యాధరపురంలో ఉర్దూ జూనియర్‌ కాలేజీకి ఎకరా స్థలం కేటాయింపు

ఏసీబీలో 350 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం

ఏసీబీలో 300 పోస్టులు నేరుగా, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 50 పోస్టుల భర్తీ

గన్నవరం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 25 పోస్టులు మంజూరు

నాన్ అమృత్ పథకం కింద 42 మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 4,188.71 కోట్లతో ప్రాజెక్టు ఎక్స్‌టెర్నల్‌ ఎయిడెడ్ ప్రాజెక్టుల కోసం నిధులు

గ్రామ రెవెన్యూ సహాయకులకు అదనంగా రూ.300 ఇచ్చేందుకు నిర్ణయం

ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్‌ బోర్డుకు స్వయం ప్రతిపత్తి

డ్రాఫ్ట్‌ బిల్లుకు కేబినెట్ ఆమోదం

స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్‌ బోర్డు, ప్రమోషన్‌ కమీటీలకు స్వయం ప్రతిపత్తి

స్పై సినిమాస్‌ సంస్థకు విశాఖలో 2.7 ఎకరాలు.

తిరుపతిలో 3.72 ఎకరాలు కేటాయింపు.ఏడాదికి రూ. 3.265 కోట్ల చొప్పున 33 ఏళ్లకు లీజు,కుటుంబ వినోద కేంద్రం ఏర్పాటు చేయనున్న స్పై సినిమాస్ సంస్థ పీపీపీ పద్ధతిలో రూ.25 కోట్లతో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేసేలా ఒప్పందం.