//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"యన్‌.టి.ఆర్‌ బయోపిక్" చూసిన తరువాత ఏ.పీ C.M చంద్రబాబు స్పందన...!

Category : movies

రీసెంట్ గా రిలీజ్ ఐన "యన్‌.టి.ఆర్‌ బయోపిక్ " విశేష స్పందన లభిస్తోంది. తెలుగు వారి గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండి పోయే గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి బయోపిక్ జనవరి 9న మనముందుకు రాగా..

ఈ సినిమాను యన్‌.టి.ఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి అయినశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం రాత్రి బెంజిసర్కిల్‌లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ మాల్‌లో ఈ చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరియు ఈ సినిమా దర్శకుడు అయిన క్రిష్‌ జాగర్లమూడితో కలిసి చంద్రబాబు సినిమా చూసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా అనతరం ఆయన వారిని ప్రశంసించడంతో పాటు సత్కరించారు.

ఈ సినిమాలో బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను అద్భుతంగా పోషించారని చంద్రబాబు పేర్కొన్నారు. యన్‌.టి.ఆర్‌ లాంటి మహానుభావుడి సినిమాను తెరకెక్కించిన క్రిష్ కి ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

అయితే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా తమ పాత్ర స్థాయి మేరకు చాలా అద్భుతంగా నటించారని.ఈ బయోపిక్‌లో బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌,హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్,జయప్రదగాహన్సిక,జయసుధగాపాయల్‌రాజ్‌పుత్‌ నటించారు. ఆయన తన అభిప్రాయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సినిమాకి ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందించగా ...బాలకృష్ణ బాబు నిర్మించారు. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకో గా మరో భాగం వచ్చే నెలలో ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News