//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసెంబ్లీ లో ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన యనమల...!

Category : politics

2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ లక్షా 91వేల 63 కోట్లతో ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ 28,678 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్‌ 21.70 శాతం మేర పెరిగింది.

బడ్జెట్ కేటాయింపులు :

న్యాయశాఖకు రూ.886 కోట్లు

హోంశాఖకు రూ.6226 కోట్లు

పర్యాటకశాఖ రూ.290 కోట్లు

సీఆర్డీఏకు రూ.7761 కోట్లు

వ్యవసాయశాఖ రూ.12,355 కోట్లు

గ్రామీణాభివృద్ధి రూ.20,815 కోట్లు

సాగునీటి రంగం రూ.16,078 కోట్లు

పరిశ్రమలు, గనులు రూ.3074 కోట్లు

రవాణాశాఖ రూ.4653 కోట్లు

విద్యాశాఖ రూ.24,185 కోట్లు

క్రీడలు, యువజన రూ.1635 కోట్లు

సాంకేతిక విద్య రూ.818 కోట్లు

వైద్యారోగ్యశాఖ రూ.8463 కోట్లు

నీటిసరఫరా రూ.2623 కోట్లు

గృహనిర్మాణం రూ.3679 కోట్లు

పట్టణాభివృద్ది రూ.7740 కోట్లు

సంక్షేమరంగం రూ.13720 కోట్లు

ఇంధన రంగానికి రూ.5052 కోట్లు

సమాచార పౌరసంబంధాల శాఖ రూ.224 కోట్లు

కార్మికశాఖ రూ.900 కోట్లు

సామాజిక భద్రత రూ.3029 కోట్లు

జనరల్ ఎకో సర్వే సర్వీస్ రూ.4899 కోట్లు

ఎస్సీ, బీసీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక రూ.200 కోట్లు

బీసీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2160 కోట్లు

కాపు విద్యార్థులకు రూ.400 కోట్లు

ఆదరణ పథకానికి రూ.750 కోట్లు…2.50 లక్షల మందికి లబ్ధి

వైశ్యుల సంక్షేమం రూ.30 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు

జనతా వస్త్రాల పథకం మళ్లీ ప్రారంభం, రూ.200 కోట్లు కేటాయింపు

నేతన్నలకు నూలు పంపిణీ రాయితీ

మరపడవలు, వలల సబ్సిడీకి రూ.72 కోట్లు

50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు

హిజ్రాల సంక్షేమానికి రూ.20 కోట్లు

లిడ్‌ క్యాప్‌కు రూ.40 కోట్లు

కల్లు గీత కార్మికుల సంక్షేమానికి రూ.70 కోట్లు

కళా సాంస్కృతిక రంగం రూ.94 కోట్లు

రైతు రుణవిముక్తి రూ.4,100 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ రూ.250 కోట్లు

మెగాసీడ్‌ పార్క్‌ రూ.100 కోట్లు

అగ్రికల్చర్‌ వర్సిటీకి రూ.357 కోట్లు

చేనేతకార్మికులకు రూ.42 కోట్లు

చంద్రన్న పెళ్లికానుక (బీసీలకు) రూ.100 కోట్లు

ఈబీసీలకు ఫీజురీఎంబర్స్‌మెంట్‌ రూ.700 కోట్లు

ఎంబీసీలకు రూ.100 కోట్లు

బీసీ కార్పొరేషన్‌ రూ.600 కోట్లు

ఫైబర్‌ గ్రిడ్‌ రూ.600 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్యసేవ రూ.1000 కోట్లు

ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ రూ.270 కోట్లు

పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణకు రూ.575 కోట్లు

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1668 కోట్లు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రూ.300 కోట్లు

ఐటీ రూ.461 కోట్లు

ఐటీకి ప్రోత్సాహకాలు రూ.400 కోట్లు

ఈ ప్రగతికి రూ.200 కోట్లు

దుల్హన్‌ పథకానికి రూ.80 కోట్లు

ఇమాం, మౌజమ్‌లకు ప్రోత్సాహకాలు రూ.75 కోట్లు

అన్నా క్యాంటీన్లకు రూ.200 కోట్లు

ఏపీ సిడ్కోకు సాయం రూ. 1000 కోట్లు

ఎన్టీఆర్‌ పెన్షన్‌ రూ.5 వేల కోట్లు

డ్వాక్రా రుణమాఫీ రూ.1700 కోట్లు

వడ్డీ లేని డ్వాక్రా రుణాలకు రూ.1000 కోట్లు

ఇంకా యనమల మాట్లాడుతూ కేంద్రం నుండి మనకు కావలిసినంతగా సాయం అందడం లేదని అన్నారు. కేంద్రం సహకరించి ఉంటే మరింత పురోగతి సాధించే అవకాశం ఉండేదని యనమల అన్నాడు. నిరాశ, నిస్తేజంల మధ్యే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాలతో సమానంగా ఎదిగేందుకు పట్టుదలతో పోరాడతామన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుతున్నామన్నారు. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశామని యనమల చెప్పారు.