//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో కొనసాగుతున్న బంద్ అన్ని జిల్లా లో నిలిచిన బస్సులు..

Category : politics

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాల్లోని బస్ డిపోల వద్ద టీడీపీ కార్యకర్తలు, వైసీపీ, వామపక్ష నేతలు నిరసనకు దిగారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

బంద్‌ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లు మూతపడ్డాయి. బంద్‌ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పగో జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఏలూరు, తణుకులో బస్సులను విపక్షాలు అడ్డుకున్నారు. మరోవైపు ఏలూరులో వామపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బంద్ నేపథ్యంలో జూట్‌ మిల్లును మూసివేశారు.

అటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కొవ్వూరు ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష నాయకులు, కార్యకర్తల ధర్నాకు దిగాయి. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జంగారెడ్డిలో వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. విభజన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

తూగో జిల్లా కాకినాడ ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ స్వచ్ఛందంగా బస్సులను నిలిపివేసింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. దీంతో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

కడప బస్టాండ్‌ ఎదుట బస్సులను విపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా డిపోలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన హమీలను అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర సీపీఐ నాయకులు ఆందోళన దిగాయి. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

శ్రీకాకుళం బంద్‌ నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సీపట్నం, మద్దిలపాలెం డిపోల ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. అటు పాడేరులో వామపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. భారీగా పోలీసుల మోహరించారు.

తిరుపతి లో బంద్ సందర్భంగా తిరుపతి అంబేద్కర్ విగ్రహం దగ్గర వామపక్ష కార్యకర్తల ధర్నా దిగారు.

Related News