//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణా ఏపీల మధ్య కొత్త వార్ ... విద్యుత్ బకాయిల వివాదం

Category : politics state

తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతుంది. రానున్న ఎన్నికల నేపధ్యంలో ఒకరిని ఒకరు ఊపిరి సలపకుండా చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఇంతవరకు పట్టించుకోని పలు వివాదాలు తాజాగా తెరమీదకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. పలు సంస్థలకు సంబంధించిన ఇచ్చి..పుచ్చుకునే సందర్భాల విషయంలో కూడా ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు. ఐటీ గ్రిడ్ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని తెలంగాణా ప్రభుత్వం చూస్తే , విద్యుత్ శాఖ నుండి తమకు రావాల్సిన బకాయిల చెల్లింపు తెలంగాణా చెయ్యటం లేదని ఏపీ తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టనుంది.

తెలంగాణ, ఏపీ విద్యుత్‌ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి... ఏపీ విద్యుత్ శాఖాధికారులు తమకు రూ. 5,600 కోట్లు ఇవ్వాలంటూ చెప్తుంటే , ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ..నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందనీ..మాకు రావాల్సింది మాకు ఇచ్చి..వారికి వెళ్లాల్సింది ఉంటే తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఏపీ నుంచి స్పందన లేదని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఆరోపించారు. దీనిపై ఏపీ జెన్ తీవ్రంగా ఖండించింది.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలు చెప్పిన అంశాలు వాస్తవ విరుద్ధమని ఏపీ జెన్‌కో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వారు విద్యుత్తు వినియోగించుకున్న పుస్తకాల్లోని గణాంకాల ఆధారంగా లెక్కించినా తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు ఇంకా రూ.11,728 కోట్లు రావాల్సి ఉందనే విషయం అర్థమవుతుందని ఏపీ జెన్ కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా రూ.8,274.23 కోట్లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉందన్న విషయం పేర్కొన్నారని..మిగిలిన మొత్తం తెలంగాణ ఉత్తరప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన బకాయిగా ఏపీ జెన్‌కో వివరించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ డిస్కంలకు విద్యుత్తు సరఫరా చేశామని..ఇందుకు రూ.5,732.40 కోట్లు రావాల్సి ఉందని ఏపీ జెన్ కో స్పష్టం చేసింది.

ఈ బకాయిలు రాబట్టుకోవడానికి ఎప్పటికప్పుడు జెన్‌కో ప్రయత్నిస్తోందని..రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. ప్రతి నెలా విద్యుత్తు బిల్లులతో పాటు రూ.150 కోట్ల చొప్పున తీర్చేస్తామని తెలంగాణ అంగీకరించిందనీ..అయినా అవి ఇంతవరకు ఆ మాట నెరవేర్చలేదని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. ఇక నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ముందు తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేయడం తప్ప ఏపీ జెన్‌కోకు మరో మార్గం లేదని ఏపీ జెన్ కో స్పష్టం చేసింది.