Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వీవీఫ్యాడ్ స్లిఫ్ క‌న‌బ‌డేది 7సెక‌న్లా ,3సెక‌న్లా..?త‌ప్పెక్క‌డ జ‌రిగింది ....?

Category : state politics

ఏపీ రాజ‌కియాల‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించిన తీరు స‌రిగా లేద‌ని ,మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయ‌ని ,ఆ అనుమానాల‌ను మీరే తీర్చాల‌ని ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు కేంద్ర ఎన్నిక‌ల అధికారికి ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఫిర్యాదు లో ముఖ్యంగా 7సెక‌న్లు క‌న‌బ‌డాల్సిన ఓట‌ర్ స్లిఫ్ 3సెక‌న్లే క‌నబ‌డంద‌ని ,దీనికి సంబంధించిన పూర్తి కార‌ణాలు మాకు కావాల‌ని చంద్ర బాబు ఆ నివేదిక‌లో పేర్కోన‌డం జ‌రిగింది .

ఇక అస‌లు విష‌యాల‌లోకి వ‌స్తే ... ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఒటు వేస్తే వీవీ ఫ్యాడ్ లో స్లిఫ్ 3సెక‌న్లే క‌న‌బ‌డిన ఒక విడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ విడియోను చూసిన టీడీపీ టెక్నిక‌ల్ టీం అభ్య‌ర్థి హ‌రిప్ర‌సాద్ ఇలా ఎందుకు జ‌రిగింద‌నే అభ్యంత‌రాన్ని లేవ‌నెత్తారు.ఏ ఎన్నిక‌ల‌లో అయినా ఓట‌ర్ ఓటు వేసిన త‌ర్వాత వీవీ ఫ్యాడ్ లో స్లిఫ్ 7సెక‌న్లు క‌న‌బ‌డుతుంద‌ని .కానీ... ఈవిడియోలో 3 సెక‌న్లే క‌న‌బ‌డ‌డం మాకు తీవ్ర అభ్యంతరాల‌కు తావునిస్తుంద‌ని హ‌రిప్ర‌సాద్ అన్నారు . అయితే ఇలా జ‌ర‌గాలంటే ఈవీఎంల‌లో కోడ్ ను మార్చాల్సి ఉంటుందని ఈసీ చెపుతుంది .కానీ ..ఇది సాధ్యం కానీ పని అని కూడా ఈసీనే అంటుంది .

అయితే మ‌రీ ఈ కోడ్ ను ఎవ‌రు మార్చార‌నే దానిపైనే ఇప్పుడు పూర్తి చ‌ర్చ న‌డుస్తుంది .ఈ విష‌యం పై ఈసీ మాట్లాడుతూ .... ఈవీఎంల‌లో కోడ్ ను మార్చాలంటే ఎవ‌రికి సాధ్యం కాద‌ని ,దీని పై పూర్తి అవ‌గాహ‌న‌ను మేము తెలియ‌జేస్తామని చెప్పారు.అయితే ఈ వీవీఫ్యాడ్ లో ఇలా రావడం క‌రెక్ట్ కాద‌ని ,దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌లో టిడీపీ ఉన్న‌ట్లు తెలుస్తుంది.ఇప్ప‌టికే ఈ విష‌యం పై ప‌లు అభ్యంతరాలు తెలుపుతూ బీజేపేత‌ర పార్టీల‌తో టీడీపీ మ‌ధ్ధ‌తు కూడ‌గట్టుకుంటుంది .

Related News