//single page style gallary page

Any Relief from the piracy mafia on Cinema Industry

Category : movies

Click here to read this article in Telugu

పైరసీ మాఫియా నుండి ఉపశమనం దొరికినట్లేనా..!

పైరసీ భూతం ప్రపంచ వ్యాప్తంగా, ఎంతగా వ్యాపించిందో అందరికి తెలిసిన విషయమే. కగా ప్రపంచ వ్యాప్తంగా సినీ నిర్మాతలు ఏటా వేల కోట్ల రూపాయలు పైరసి కారణంగా నష్టపోతున్నారంటే అతిశయోక్తికాదు. డ్రగ్ మాఫియా,గోల్డ్ మాఫియాలా పైరసీని ఓ పెద్ద మాఫియానే నడిపిస్తుంది. ఎన్ని రకాలుగా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నా వారి నుండి తమ సినిమాలను కాపాడుకోలేక పోతున్నారు. ఆధునిక పద్దతులను ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఈ పైరసీ ముఠా చెలరేగిపోతుంది. మూవీ విడుదలైన గంటల వ్యవధిలోనే నెట్ లో ప్రత్యక్షం అవుతుంది. ఇక అసలు కొన్ని సంధర్బాలలో ఏకంగా విడుదలకు ముందే చిత్రాలు లీక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తమిళ్ రాకర్స్ ను బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశాలు జారీచేయడం జరిగింది.

అంతేకాకుండా తమిళ్ రాకర్స్ తో పాటు ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా సైట్ల యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, పలు నిర్మాణ సంస్థల కాపీరైట్లను ఉల్లంఘించాయంటూ వాటి డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది. ఇక ఇలాంటి కఠిన చర్యల తరువాతైనా మూవీ నిర్మాతలకు పైరసీ మాఫియా నుండి ఉపశమనం దొరుకుతుందేమో చూడాలి మరి.

It is a well known fact that piracy demon has spread all over the world. It is no exaggeration that filmmakers around the world are losing thousands of crores of rupees annually. Drug Mafia , Gold Mafiala Piracy drives a big mafia. No matter how many types of producers care, they can't protect their films. This piracy gang is constantly getting used to the latest methods. The movie will be live on the net within hours of its release. In some of the original cases, the images leak before being released. However, the Delhi High Court has now ordered Internet service providers to block Tamil rockers.

Moreover, the Delhi High Court has ruled that internet service providers should take steps to temporarily suspend sites such as EZ TV, Cut Movies and Lyme Torrents along with Tamil rockers . The site URLs and IP addresses are blocked. Moreover, the Central Information Technology Ministry has made it clear that the copyrights of several construction companies have been violated and their domain registrations have been removed. Even after such strenuous action, movie makers need to see if the piracy mafia can be relieved .