//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డార్లింగ్ ప్ర‌భాస్‌కు గాయాలు.. దుబాయ్ వెళ్లి మ‌రీ వార్నింగ్ ఇచ్చిన అనుష్క..!

Category : movies

టాలీవుడ్‌లో ప్రభాస్ - అనుష్కలది హిట్ పెయిర్‌. బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్‌లో న‌టించిన ఈ జోడీ పై ఎప్ప‌టి నుండో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించి మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. అస‌లు విష‌యం ఏంటంటే ప్ర‌భాస్ బాహుబ‌లి త‌ర్వాత‌ న‌టిస్తున్న‌ చిత్రం సాహో షూటింగ్ నెల రోజుల నుంచి దుబాయ్‌లో జరుపుకుంటుంది. దుబాయ్ లో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో 90 కోట్లతో ఫైట్ సీన్ ను చిత్రీకరించారని వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ప్రభాస్ ఈ యాక్షన్ సీన్స్ కోసం కంప్రమైజ్ కాకుండా రియాల్టీ కోసం డూప్ లేకుండా ప్రభాస్ షూటింగ్ చేశారు. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్ కు రెండు సార్లు గాయాలు అయ్యాయని టాక్. అయితే ఈ విషయం తెలుసుకున్న అనుష్క వెంటనే దుబాయ్ వెళ్లి ప్రభాస్‌కు క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ షాట్లు చెయ్యొద్దని, ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట. ప్రభాస్ కూడా డూప్‌ని పెట్టుకుంటానని ప్రామిస్ కూడా చేశాడని సమాచారం. అయితే గత కొన్ని రోజులు నుండి ప్రభాస్ – అనుష్కల పెళ్లి గురించి వార్తలు వస్తుంటే అనుష్క అవి ఏమి పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్‌ని కలవటానికి వెళ్లిందని సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వార్త‌లు హాల్ చ‌ల్ చేస్తున్నాయి.